Welcome to yb TELUGU VERSES Search IN TELUGU SCRIPT

Maintained by ybrao-a-donkey.

Subject list in the menu box is not exhaustive. You can type anything in the search box including phrases.

Images where-ever used, are courtesy their owners, may be subject to their copyrights. They are only for Representational purposes.

Pl. do not use extremely common words such as వేమా or భారతం. You will get thousands of results and they will be unmanageable. Use rare words and get few results, then studying them will be easy. దయయుంచి అరుదైన పదాలే వెతకండి. లేదండి, వేలాది ఫలితాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
Examples of some search words which can be typed in the search window / or selected from menu: వెతుకుడు కిటికీలో టైపు చేయటానికి కొన్ని ఉదాహరణలు:-

అగ్ని అయోధ్య
కల్యాణి కుంతి కుమారీ కృష్ణా
గగన గజ్జె గాంధారి గోపాల
చిత్ర చిత్ర ప్రభావ
తాటక త్యాగరాజ
దాశరథీ ద్రుపద ద్రౌపది ద్వారక ద్వైతము ద్వైతుడు
నరసింహ నారాయణా
బలరామ భారము భాస్కరా భీమ భుజగ భుజంగ
మార్గము మారీచ మోహన
రంజని రాధ రామదాసు రుక్మిణి
లక్ష్మ
వినుర_వేమ విశ్వదాభిరామ విష్ణు
శ్రీకాకుళ శ్రీకాళహస్తీశ్వరా శృతి
సదయా సీతా సుమతీ
హరిహరనాథా హవ్యవాహ

showing results for మాద్రి
25063
1 సీ. సమదర్శనంబున జలజాతభవుఁ దనఁ బరమ ప్రసన్నత భర్గుఁ డనఁగ
నెల్లగుణంబుల నిందిరావిభుఁడన నధిక ధర్మమున యయాతి యనఁగ
ధైర్యసంపద బలి దైత్యవల్లభుఁ డన నచ్యుత భక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ
రాజితోదారత రంతిదేవుండన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ
తే. యశము నార్జించుఁ బెద్దల నాదరించు నశ్వమేధంబు లొనరించు నాత్మసుతుల
ఘనులఁ బుట్టించు దండించు ఖలులఁబట్టి మానధనుఁడు నీమనుమండు మానవేంద్ర!
, Canto 1, , పోతన భాగవతం , ప్రథమ స్కంథం
2 ఉ. ఆయెడ దైత్యనాయకుఁ డహంకృతి రామునిమేన నాటఁగా
వేయుశరంబు లాయముల వేగమె గాఁడిన రక్తపూరముల్‌
కాయముదొప్పఁదోఁగఁవడిఁగ్రమ్మెడు నప్పుడు గూడ నొప్పెఁ బ
ద్మాయత లోచనుండు చరమాద్రితటిం దగు భానుఁడోయనన్‌.
Molla Ramayanam, Yudhdha Kanda, Part 3 మొల్ల రామాయణం, యుధ్ధ కాండ, తృతీయాశ్వాసము
3 చ. అవని విధీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా ర్ణవమది యింకినన్ దివస నాథుఁడుఁ జంద్రుఁడు దేయ మేదినం గువలయనాథ నీకు నొక కుత్సిత భావముఁ గల్గ నేర్చునే భవదుపయోగ్య మైన నృప భారము నాకు వహింప శక్యమే.
026
Andhra Mahabharatam Nannaya Bharatam, Aranya parvam, shashthasvasam ఆంధ్ర మహాభారతం, నన్నయ భారతం, అరణ్య పర్వం, షష్ఠాశ్వాసం
4 ఉ. బోరన విస్ఫులింగములు వొడ్మఁగ నుగ్ర విషంబు గ్రక్కుచుం గ్రూర విచేష్ట నాలుకలు గ్రోయు మహోరగరాజయుగ్మముం జేరి పదాహతిం గినియఁ జేయఁ దలంచుట గా నెఱుంగు దు ర్వారులు మాద్రి పుత్త్రుల కవజ్ఞ యొనర్పఁ దలంచు టేర్పడన్.
179
Andhra Mahabharatam Nannaya Bharatam, Aranya parvam, shashthasvasam ఆంధ్ర మహాభారతం, నన్నయ భారతం, అరణ్య పర్వం, షష్ఠాశ్వాసం
5 సీ. కరుణారసము వొంగి - తొరఁగెడుచాడ్పున, శశిరేఖ నమృతంబు - జాలువాఱ
హరినీలపాత్రిక - సురభిచందన మున్న,గతి నాభి ధవళపం-కజము మెఱయ
గుఱి యైన చెలువున - నెఱసినలోకర,క్షణ మన గరళంబు-చాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోఁతెంచు-భానుబింబము నా ను,రమ్మునఁ గౌస్తుభ-రత్న మొప్ప
తే. సురనదియును గాళిందియు - బెరసినట్టు, కాంతిపూరంబుశోభిల్ల - శాంతమూర్తి
నామనంబు నానందమ-గ్నముఁగఁ జేయ, నెలమి సన్నిధి సేసె స-ర్వేశ్వరుండు. 12 f112 Andhra Maha Bharatam, Tikkana Bharatam, Virata parvam, prathamasvasam ఆంధ్ర మహాభారతం, తిక్కన భారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం

6 శా. ఆరూపం బవికార మాభుజబలం - బత్యంతనిర్గర్వ మా
శూరత్వంబు దయారసానుగత మా-శుంభత్క్రియాజ్ఞాన మా
ర్యారంభ ప్రతికూలవాదరహితం - బాయీగి సమ్మానవి
స్తారోదాత్తము మాద్రిపిన్నకొడు కే-తన్మాత్రుఁడే చూడఁగన్‌. 209
Andhra Maha Bharatam, Tikkana Bharatam, Virata parvam, dvitiyasvasam ఆంధ్ర మహాభారతం, తిక్కన భారతం, విరాటపర్వం, ద్వితీయా శ్వాసం
7 ఉ. దానికిఁ జిత్తవృత్తులు ము-దంబునఁ బొందఁగ మేను లుబ్బఁగా
సేనలు రెండు నుద్భట వి-జృంభణత న్‌ వివిధాస్త్రఘట్టన
ధ్వానము దిక్కులం బరఁగఁ - దాఁకి రణం బొనరించె నత్తఱి న్‌
భానుఁడు పశ్చిమాద్రిఁ గను-పట్టెఁ దలిర్చినమావిమ్రో కనన్‌. 192
Andhra Maha Bharatam, Tikkana Bharatam, Virata parvam, tritiyasvasam ఆంధ్ర మహాభారతం, తిక్కన భారతం, విరాటపర్వం, తృతీయాశ్వాసం
8 క. శత్రునృపకాలకూటము, మిత్రామృతవృష్టి బుధస-మీహిత సిద్ధి
క్షేత్రము సజ్జనసంస్తుతి,పాత్ర మితఁడు మాద్రితొలుత-పట్టి నరేంద్రా. 326
Andhra Maha Bharatam, Tikkana Bharatam, Virata parvam, panchamasvasam ఆంధ్ర మహాభారతం, తిక్కన భారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం
9 వ. మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై. 35Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

10 ఉ. వాసవసన్నిభుండు హిమవన్నగదక్షిణపార్శ్వభూములన్‌
శ్రీసతిఁ బోని కుంతియును జెల్వగు మాద్రియుఁ దోడ రాఁగ బా
ణాసన బాణ భాసిత మహాభుజుఁడై విహరించుచుండె ని
చ్ఛాసదృశంబుగా గజవశాద్వయమధ్య గజేంద్ర లీలతోన్‌. 47
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

11 వ. అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి; ‘మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవృత్తి నునికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురనకుం గౌసల్యలకు వృద్ధపురోహిత బ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం’ డనిన, వారలు బాష్పపూరితనయన లయి ‘యిట్టి యుగ్రతపంబు విడిచి, మమ్ము విడువనియట్టి యాశ్రమంబున నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్పుడ ప్రాణంబులు విడుతు’ మనిన వారల నిశ్చయం బెఱింగి ‘యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి, రేపును మాపును మధ్యాహ్నంబునప్పుడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండనై, పితృదేవతల వాక్సలిలవన్యఫలంబులం దనుపుచుఁ, గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు’ నని యప్పుడు. 61Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

12 వ. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. 128Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

13 భీమునిశరీరదార్ఢ్యము
మాద్రికి నకులసహదేవులు పుట్టుట

14 మాద్రికి నకులసహదేవులు పుట్టుట Sanskrit Vyasa Mahabharata Ref: 1-115-1వ. అని వగచుచు నొక్కనాఁ డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి ‘కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి’ మ్మనిన మాద్రికిఁ బాండురా జి ట్లనియె. 130Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతం Nannaya Mahabharatam నన్నయ మహాభారతం
Adi Parvam ఆది పర్వం

15 వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రి దయిన మనోవాంఛితంబుఁ జెప్పి ‘సకలలోక కల్యాణ కారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు’ మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి. 132Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

16 మాద్రికి నకులసహదేవులు పుట్టుట
పాండురాజుమరణము

పాండురాజుమరణము Sanskrit Vyasa Mahabharata Ref: 1-116-4వ. ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱియున్న యవసరంబున. 140 Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతం
Nannaya Mahabharatam నన్నయ మహాభారతం
Adi Parvam ఆది పర్వం

17 ఉ. చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము
క్తా రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం
గారవిలాసలీల యెసఁగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁ డై. 141
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

18 క. కిందముశాపము డెందము |
నం దలఁపక శాపభయమునన్‌ మాద్రి గడున్‌
వందురి వారింపఁగ బలి |
మిం దత్సంభోగసుఖసమీహితుఁ డయ్యెన్‌. 142
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

19 వ. దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించుకొని మాద్రి యఱచుచున్న, దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి, శతశృంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె. 143Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

20 ఉ. ‘నా కెడ యిమ్ము, లెమ్ము, కురునాథుమనఃప్రియధర్మపత్ని నే
నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదుఁ; బుత్త్రులం
జేకొని పెన్పు; నా పసుపుఁ జేయుము’ నావుడు మాద్రి దద్దయున్‌
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్‌. 144
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

21 వసంతవర్ణనము
మాద్రి సహగమనము సేయుట

22 మాద్రి సహగమనము సేయుట Sanskrit Vyasa Mahabharata Ref: 1-116-25తరువోజ. కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిఁ గొడుకులఁ బడసి యి క్కురుకుంజరునకుఁ
గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికిఁ గారణమవై కమలాక్షి! నీవు
దిరముగా నిష్టంబు దీర్చి; తే నిందు ధృతిఁ బతియిష్టంబు దీర్పన; కాన
యరిగెదఁ బతితోడ నన్యలోకంబునం దైనఁ బ్రీతిసేయఁగఁ గాంతు ననియు. 145
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతం Nannaya Mahabharatam నన్నయ మహాభారతం
Adi Parvam ఆది పర్వం

23 క. త్రిదశాధినాథసదృశుఁడు |
ద్రిదశాలయమునకు మాద్రిదేవియుఁ దానున్‌
ముదమొనర నరిగె నేఁటికిఁ |
బదియేడగునాఁడు దురితబంధచ్యుతుఁ డై. 154
Andhra Mahabharatam ఆంధ్ర మహాభారతంNannaya Mahabharatam నన్నయ మహాభారతం Adi Parvam ఆది పర్వం

24 మాద్రి సహగమనము సేయుట
కురుపాండుకుమారుల బాలక్రీడలు

25 ఉ. ఒక్కొకచోఁ గడంగి ప్రతియోధులు మార్కొనునప్పు డాత్మలన్‌
నెక్కొని మోములం బొడము నెవ్వగతోడ జనంబు లిట్టి యం
దక్కట! భీముఁ డైన, మన యర్జునుఁ డైనను, మాద్రి పుత్త్రులం
దొక్కరుఁడైన నీ పగఱ నుక్కడఁగింపరె యొక్క వ్రేల్మిడిన్‌? 287 [Tikkana Bharatam Udyoga Parvam తిక్కన భారతం ఉద్యోగ పర్వం]

26 ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఏనుగు లక్ష్మణ కవి, నీతి శతకం.★

606

Contact